చిత్తూరు జిల్లాలో..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గోపాలకృష్ణపురం బాలయోగి గురుకుల పాఠశాలలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సామాజికంగా ముందడుగు వేస్తారని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమగ్ర శిశు అభివృద్ధి శాఖ అధికారులు నగరి ఎమ్మెల్యే రోజాని, కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఘనంగా సత్కరించారు. మహిళలను గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోడూరు ఎమ్మెల్యే అన్నారు.
ప్రకాశం జిల్లాలో..
మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థిక స్వాతంత్రం సంపాదించినప్పడే మహిళా సాధికారత అని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ప్రతిభ జూనియర్ కళాశాలలో.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన అంజర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
గుంటూరు జిల్లాలో..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో మహిళలతో కలిసి ఎమ్మెల్యే శ్రీదేవి ర్యాలీ నిర్వహించారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. పురుషునితో నేడు అన్ని రంగాల్లో పోటీపడుతూ.. మహిళలు ప్రతిభ చాటుకుంటున్నారన్నారు. మహిళల అభివృద్ధికి సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నరని కొనియాడారు.
కృష్ణా జిల్లాలో..
మహిళలు వాటర్ స్పోర్ట్స్‌లో పాల్గొనాలని శాప్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్వీ రమణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భవానీ ద్వీపంలో కేక్ కట్ చేశారు. రాష్ట్రం వ్యాప్తంగా క్రీడల్లో మహిళలు చురుకుగా పాల్గొనట్లేదని.. ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోస్టల్ తీరంలో వాటర్ స్పోర్ట్స్‌ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడలో అమరావతి బోటింగ్ క్లబ్ దీనికి కృషి చేస్తుందన్నారు. ఎప్పుడూ ఖాళీ లేకుండా ఉండే అధికారులు మహిళ దినోత్సవం రోజు సాయంత్రం బోటింగ్ చేశారు.
మహిళలను గౌరవంగా ఎలా చూడాలో.. చిన్నప్పటి నుంచే నేర్పించాలని సీఐడీ డీజీ సునీల్ కుమార్ అన్నారు. విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో సీఐడీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు సత్కారం చేశారు. దాడి జరిగితే మహిళలు కుంగిపోకూడదని.. ధైర్యంగా ముందుకు వచ్చి న్యాయం కోసం ప్రయత్నించాలన్నారు.
అవనిగడ్డలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రచయిత్రి సింహాద్రి పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐ రవికుమార్, ప్రముఖ రచయిత్రి దీవి ఝాన్సీ పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన మహిళా ప్రజా ప్రతినిధులు పాలనలో రాణించాలని.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. వారందరికీ తన వంతు సహకారం ఉంటుందని ఆయన వెల్లడించారు. పురుషుల కంటే మహిళలు మెరుగైన పాలన అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పోతవరంలో వైకాపా కార్యలయం వద్ద నూతన మహిళా ప్రజాప్రతినిధులు, డ్వాక్రా యానిమేటర్లు తదితరులను ఆయన సత్కరించారు.
ఇదీ చూడండి:'విశాఖ ఉక్కు, అనుబంధ సంస్థల్లో 100 శాతం వాటాలు అమ్మేస్తాం'