కోట్ల రూపాయలు దోచేసి నీతిమంతమైన పాలన అందిస్తామంటే ప్రజలు హర్షించరని సీఎం జగన్కు పవన్ కల్యాణ్ పరోక్షంగా చురకలంటించారు. జాతీయ జెండా రూపశిల్పి పింగలి వెంకయ్య ఆకలి అలమటించి చనిపోయారని ఆ మహానుభావుడి ఆశయాలను నెరవేర్చేందుకే జనసేన స్థాపించానని పవన్ కల్యాణ్ చెప్పారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులతో పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తాను రెండు చోట్ల ఓడిపోయినా మళ్లీ బలంగా పోరాడాలనే భావన కల్గిందని చెప్పారు. వైకాపాకు 151 మంది శాసన సభ్యులున్నా జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నా ఒకటేనన్నారు. తన ఆశయాలకోసం ప్రాణాలైనా ఫణంగా పెడతానని చెప్పారు. పార్టీ నేతలంతా వ్యక్తి అజెండాలను పక్కన పెట్టి.. ప్రజల కోసం పనిచేయాలని జనసేన అధినేత సూచించారు.
సీఎంకు పరోక్షంగా చురకలంటించిన..జనసేన అధినేత - అవినీతి
లంచాలు,అవినీతి లేని ప్రభుత్వం కావాలి..ప్రజల్ని పీడించే ప్రభుత్వాలు కాదు. ప్రజల్ని ఆదుకునే ప్రభుత్వం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైకాపాకు 151 మంది శాసన సభ్యులున్న జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నా సమానం అని అన్నారు.
జనసేన అధినేత