ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆహా ఏమి రుచి... ఇడ్లీలలో ఈ ఇడ్లీలే వేరయా!

ఇడ్లీ.. ఇండోనేషియాలో పుట్టి... ఇండియా వాసుల జీవితంతో పెనవేసుకుపోయింది. ప్రతి ఇంటిని ఏలేస్తోంది. అనారోగ్యం చేసినప్పుడు... ఇదో దివ్య ఔషదమైన ఆహారంగా ప్రాచూర్యం పొందింది. అయితే.. ఇడ్లీ అంటే అందిరికీ తెలిసింది ఒక్కటే! కానీ... ప్రస్తుతం అది పసందు చేసేందుకు సిద్ధమైంది. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 18 రకాల ఇడ్లీ అంటే... ఇక భోజన ప్రియులకు పండగే కదా...

idli-street-in-guntur

By

Published : Jul 27, 2019, 2:56 AM IST

ఇడ్లీ రుచి మారింది గురూ...

ఫుడ్ ట్రెండ్​కు గుంటూరు పెట్టింది పేరు. కాకా హోటళ్ల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు ఇక్కడ కొలువుదీరాయి. భిన్నమైన రుచులను ఇష్టపడేవారితోపాటు.. వాటిని పరిచయం చేసే వ్యాపారులకూ..ఇక్కడ కొదవ లేదు. తాజాగా ఇడ్లీ స్ట్రీట్ పేరుతో వచ్చిన వివిధ రకాల ఇడ్లీలు గుంటూరు వాసులను నోరూరిస్తున్నాయ్. ఇక్కడ 18 రకాల ఇడ్లీలు వివిధ రుచుల్లో దొరుకుతున్నాయి.

సాధారణ చట్నీ, సాంబారు ఇడ్లీలతోపాటు ఉలవచారు ఇడ్లీ, రసం ఇడ్లీ, రాగి ఇడ్లీ, బటన్ రాగి ఇడ్లీ, మిల్గాయి ఇడ్లీ, నిమ్మకాయ ఇడ్లీ, పెరి పెరి ఇడ్లీ, చిల్లీ గార్లిక్ ఇడ్లీ, లెమన్ చిల్లీ ఇడ్లీ, చాక్లెట్ ఇడ్లీ.... ఇలా పలురకాల ప్లేవర్లతో ఈ ఇడ్లీలను ఆహార ప్రియుల కోసం అందిస్తున్నారు. ఇడ్లీ స్ట్రీట్ సంస్థకు దేశవ్యాప్తంగా 36 వరకు ప్రాంచైజీలు ఉండగా... రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరులో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

రెగ్యులర్ ఇడ్లీలు అంటే మొహంమొత్తే పిల్లలు, యువతీ, యువకులు.... ఈ ఇడ్లీలను ఇష్టపడుతున్నారు. గుంటూరు, విజయవాడతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ..వీకెండ్స్ లో సందడి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details