గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం పారిశ్రామికవాడలో వెంకటలక్ష్మి అనే మహిళ హత్యకు గురైంది. భర్తే ఆమెను హత్య చేసి గోతిలో పడేశాడు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భర్త యాకయ్య పథకం వేశాడు. తానే ప్రాణాలు తీసుకుంటున్నట్టు వెంకటలక్ష్మి మృతదేహం దగ్గర ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు.
మృతురాలి బంధువుల సాయంతో లేఖలోని చేతిరాత యాకయ్యదేనని పోలీసులు గుర్తించారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.