భార్యపై ఓ భర్త కత్తితో దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. సత్తెనపల్లిలోని భావనాఋషి స్వామి ఆలయ సమీపంలో.. గోవిందయ్య, జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న జ్యోతిపై గోవిందయ్య కత్తితో దాడి చేశాడు. విచక్షణ రహితంగా శరీరంపై ఎక్కడపడితే అక్కడ పొడిచాడు. దీంతో జ్యోతి ఒక్కసారిగా కేకలు వేయటంతో ఇరుకుపొరుగు వారు ఇంట్లోకి చేరుకున్నారు.
ఈ దాడిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని.. గాయాలతో ఉన్న జ్యోతిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. భార్యపై దాడి చేసిన అనంతరం గోవిందయ్య అక్కడి నుంచి పారిపోయాడు. కొద్ది రోజులుగా తమ కుమార్తెని అల్లుడు వేధిస్తున్నాడని జ్యోతి తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న గోవిందయ్య కోసం గాలిస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం కాగా.. రెండేళ్ల కుమార్తె కూడా ఉంది.