గుంటూరు జిల్లా శావల్యపురంలో ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ... తెదేపా మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయలు ఆందోళన చేపట్టారు. ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణ సమయం మించిపోయినా... అభ్యర్థుల నుంచి ఉపసంహరణ పత్రాలు తీసుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు ఆయన్ను బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని స్టేషన్కు తరలించారు.
'సమయం దాటాక ఉపసంహరణ పత్రాలు ఎలా తీసుకుంటారు?' - ఎన్నికల అధికారులపై జీవీ ఆంజనేయులు కామెంట్స్
ఎన్నికల అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ.. గుంటూరు జిల్లా శావల్యపురంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నిరనస చేపట్టారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసినా.. అభ్యర్థుల నుంచి ఉపసంహరణ పత్రాలు తీసుకోవడాన్ని తప్పుబట్టారు.
తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు