అధికారులతో మేకతోటి సుచరిత గుంటూరులోని చింతపల్లిపాడులో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి సుచరిత ... ప్రతి ఇంటికి సంక్షేమం చేర్చేవిధంగా వాలంటీర్ల వ్యవస్థతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలి అడుగు వేశారని అన్నారు. ప్రజలు దరఖాస్తు చేసిన 72 గంటల్లో సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అక్టోబర్ నెల నుంచి సచివాలయలు ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. రైతుల పంటకు సంబంధించి ధరల స్థిరీకరణకు 3 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. గ్రామాలకు తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు వాటర్ గ్రిడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజన్న రాజ్యం దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు.
వాలంటీర్ వ్వవస్థతో ప్రతిఇంటికీ సంక్షేమం: హోంమంత్రి సుచరిత - హోంమంత్రి
గ్రామ వాలంటీర్ వ్వవస్థతో ప్రతిఇంటికీ సంక్షేమం చేరుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం చింతపల్లిపాడులో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి సుచరిత