విశాఖ పర్యటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దరఖాస్తు చేయలేదని... దరఖాస్తు చేస్తే ఆధారాలు చూపించాలని హోంమంత్రి సుచరిత అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ, శైలజానాథ్ ఇప్పటికే విశాఖలో పర్యటించారని... వారికి లేని అభ్యంతరం చంద్రబాబుకు ఎందుకని ప్రశ్నించారు. ఇక్కడ దరఖాస్తు చేయకుండా కేంద్రమంత్రికి చంద్రబాబు దరఖాస్తు చేశారన్నారు. ఇప్పటివరకు డీజీపీకి దరఖాస్తు చేయలేదని..., ఇప్పుడు సంప్రదిస్తే అనుమతి ఇస్తామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.
తితిదే నిరర్థక ఆస్తుల విక్రయం జీవోను 2016లోనే తెచ్చారని సుచరిత తెలిపారు. ఏ సంస్థ నిరర్థక ఆస్తులను ఆ సంస్థకు వినియోగించడంలో తప్పేముందని ప్రశ్నించారు.