గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 57వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పఠాన్ రిహానా, 16వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పెద్దింటి రమాదేవితో కలిసి హోంమంత్రి సుచరిత ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పాటుపడాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రచారంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైకాపా నాయకులు తాడిశెట్టి మురళీ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలి: సుచరిత - గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో మేకతోటి సుచరిత వార్తలు
మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల గెలుపునకు సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గీటురాళ్లని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. వైకాపా అభ్యర్థులను గెలిపించి.. అభివృద్ధికి పాటు పడాలన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలి: సుచరిత