ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Literacy in AP : రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత కోసం.. కృషి చేస్తున్నాం: హోం మంత్రి

Literacy in AP: రాష్ట్రంలో అక్షరాస్యత సగటును పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.25 వేల కోట్లు వెచ్చించిందని హోం మంత్రి సుచరిత అన్నారు. జాతీయ సగటుతో పోల్చితే.. రాష్ట్రంలో అక్షరాస్యత తక్కువేనని చెప్పారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతకు ప్రభుత్వం కృషి చేస్తోంది
రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతకు ప్రభుత్వం కృషి చేస్తోంది

By

Published : Jan 2, 2022, 3:28 PM IST

Literacy in AP: రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సావిత్రి బాయి పూలే పురస్కారాలను ఆమె ప్రదానం చేశారు.

అనంతరం సభలో ప్రసంగించిన హోమంత్రి.. ప్రస్తుతం రాష్ట్రంలో 67 శాతం అక్షరాస్యత ఉందన్నారు. జాతీయ సగటుతో పోల్చిచూస్తే.. ఇది తక్కువేనని చెప్పారు. అయితే.. ఈ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత సగటును పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.25 వేల కోట్లు వెచ్చించిందన్నారు.

ఉపాధ్యాయులను రోల్ మోడల్​గా తీసుకొని విద్యార్థులు.. ఉన్నత శిఖరాలను అందుకోవాలని సూచించారు. విద్యార్థుల అభ్యున్నతిలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని సుచరిత అన్నారు.

ఇదీ చదవండి :

CPI Ramakrishna on YCP schemes : మీ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏంటో చెప్పగలరా: సీపీఐ రామకృష్ణ

ABOUT THE AUTHOR

...view details