ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 3, 2019, 3:26 PM IST

ETV Bharat / state

'మహిళల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండండి'

పోలీసు స్టేషన్​కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు గౌరవంగా వ్యవహరించాలని హోమంత్రి సుచరిత సూచించారు. పరిధితో సంబంధం లేకుండా జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని ఆదేశించారు. నిర్భయ, దిశ ఘటనలతో.. రాష్ట్ర పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

home-minister-on-crime-stop-in-east-godavari
home-minister-on-crime-stop-in-east-godavari

ప్రెండ్లీ పోలీసింగ్​ అవసరమన్న హోంమంత్రి సుచరిత

మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడాలని హోంమంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. గుంటూరు నగరం పాలెంలోని మహిళా పోలీస్ స్టేషన్​ను హోంమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులతో మాట్లాడారు. తన కేసు విషయమై పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ ఆరోపించగా.... సదరు అధికారిపై హోంమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్​కు వచ్చిన బాధితులను పట్టించుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. తక్షణం ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించారు. పరిధితో సంబంధం లేకుండా జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని ఆదేశించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్​ అవసరం

దేశమంతటా మహిళా భద్రతపై తీవ్ర చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో... రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పనితీరు మెరుగుపడాలని హోమంత్రి సూచించారు. ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించకూడదని...ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అవసరమన్నారు. పోలీస్ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల పెట్టె ఉంచే యోచన చేస్తున్నామన్న హోంమంత్రి... తగినంత సిబ్బంది లేనప్పటికీ మహిళా పోలీసు స్టేషన్లలో మహిళా అధికారులనే నియమించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

ఈనాడు కథనానికి సీఎం స్పందన.. చిన్నారి కళ్లకు భరోసా

ABOUT THE AUTHOR

...view details