ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"చెత్త రహిత తెనాలికి కృషి చేద్దాం" - municipal commissioner

తెనాలిని సుందరీకరించే పనిలో పడింది యంత్రాంగం. చెత్త రహిత మున్సిపాలిటీగా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే మున్సిపల్​ కమిషనర్​ వెంకట కృష్ణ మహిళలకు పలు సూచనలు చేశారు.

'తెనాలిలో కంపోస్ట్​ విధానం తీసుకొద్దాం'

By

Published : May 16, 2019, 10:17 AM IST

గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘంలో రెండు బుట్టల విధానాన్ని ప్రారంభించి హోమ్​ కంపోస్ట్​ విధానాన్ని ప్రజలకు తెలియజేశారు మున్సిపల్​ కమిషనర్​ వెంకట కృష్ణ. ప్రజలు, పురపాలక సంఘం సహకారంతో మహిళలకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. చెత్తను ఇంట్లోనే కంపోజ్​ చేయాలని మహిళలను సూచించారు. ఈ విధానాన్ని పట్టణంలో నగర దీపికలు, డ్వాక్రా సంఘాల ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తామని కృష్ణ తెలిపారు.

'తెనాలిలో కంపోస్ట్​ విధానం తీసుకొద్దాం'

ABOUT THE AUTHOR

...view details