Guntur Jinnah Tower Controversy: గణతంత్ర దినోత్సవం వేళ గుంటూరులోని జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తామని హిందూ ఐక్య వేదిక ప్రతినిధులు ప్రకటించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంతో అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూ ఐక్య వేదికకు చెందిన ఇద్దరు వ్యక్తులు జిన్నా టవర్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. జిన్నా టవర్ పేరు మార్చాలని కొద్ది రోజులుగా భాజపాతో పాటు కొన్ని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే జిన్నా టవర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. తాజా పరిణామాలతో పోలీసులను కూడా మోహరించారు.
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు.. పోలీసుల అదుపులో హిందూ ఐక్య వేదిక సభ్యులు - గుంటూరులో జిన్నా టవర్ వివాదం
Guntur Jinnah Tower Controversy: పలువురు హిందూ ఐక్య వేదిక సభ్యులను గుంటూరు నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం వేళ గుంటూరులోని జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తామని పోస్టులు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Guntur Jinnah Tower Controversy