ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడిపందేల నిర్వహణ జీవాలపై క్రూరత్వమే- కట్టడికి కలెక్టర్లు, ఎస్పీలు కఠిన చర్యలు తీసుకోవల్సిందే: ఏపీహైకోర్టు - AP Latest News High

High Court Orders to Take Action to Prevent Cockfights: కోడిపందేల నిర్వహణ జీవాలపట్ల క్రూరానికి పాల్పడటమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోడిపందేల నిర్వహణను నిలువరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ పందేలతో భారీ జూదానికి అవకాశం కల్పించిన్నట్లు అవుతోందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

cockfights
cockfights

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2024, 11:34 AM IST

High Court Orders to Take Action to Prevent Cockfights:రాష్ట్రంలో కోడి పందేలను నిలువరించేందుకు హైకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని అన్ని జిల్లాల కలెక్టర్లును ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా కోడిపందేలు నిర్వహించకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించింది. విచ్చలవిడి జూదాన్ని అడ్డుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన హనుమ అయ్యప్ప హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కేవీ ఆదిత్యచౌదరి వాదనలు వినిపించారు. కోడిపందేల నిర్వహణ జంతుహింస నిరోధక చట్ట నిబంధనలకు విరుద్ధం అన్నారు.

ఊరూవాడా జోరుగా సంక్రాంతి సంబరాలు- భోగి మంటలు జీవితాల్లో వెలుగులు నింపాలంటూ ఆకాంక్ష

కోడిపందేల నిర్వహణను అడ్డుకోవాలని, ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని హైకోర్టు గతంలో కీలక ఉత్తర్వులిచ్చిందని పిటీషనర్ పేర్కొన్నారు. ఆ తీర్పును అధికారులు అమలు చేయడం లేదన్నారు. తీర్పును సరైన స్ఫూర్తితో అమలు చేసేందుకు తగిన ఉత్తర్వులివ్వాలని ఆయన కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునరుద్ఘాటించింది. కోడిపందేలు జరగకుండా చూడాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. జంతుహింస నిరోధక చట్టం-1960, ఏపీ జూద నిరోధక చట్టం-1974ను కఠినంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది. చట్టాల్ని సక్రమంగా అమలు చేయకపోతే కలెక్టర్, పోలీసు కమిషనర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరించింది.

ఊరు వెళ్లేందుకు ఎంపీ రఘురామకృష్ణరాజుకు రక్షణ కల్పించండి: హైకోర్టు

చట్టం అమలులో నిర్లక్ష్యం వహించిన తహశీల్దార్లు, పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. అధికారులను భాగస్వామ్యులను చేస్తూ పత్రి మండలానికి కమిటీలను ఏర్పాటు చేసి కోడిపందేలు జరగకుండా చూడాలంది. అన్ని మండలాల్లో ‘సంయుక్త తనిఖీ బృందాలను 2024 జనవరి 14లోపు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఎస్సై ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి, తహశీల్దార్, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణ కోసం పనిచేసిన స్వచ్ఛంద సంస్థ నుంచి సభ్యుడు ఆ బృందంలో సభ్యులుగా ఉండాలని స్పష్టంచేసింది. ప్రతి తనిఖీ బృందంతో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ ఫోటోగ్రాఫర్‌ ఉండేలా ఏర్పాట్లు చేయాలంది.

సంక్రాంత్రి "సంబరాల" రాంబాబు సొగసు చూడాల్సిందే! ఈ ఏడాది కూడా తనదైన శైలి నృత్యంతో ఆకట్టుకున్న మంత్రి

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదం, మద్యం అక్రమ విక్రయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని పేర్కొంటూ జి. వెంకటరత్నం మరో ఇద్దరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలను నిలువరించాలని కోరుతూ వై.ఉమాశంకరరాజు హైకోర్టును ఆశ్రయించారు. కోడి పందేల వ్యవహారంపై మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సంక్రాంతి సందర్భంగా కోడిపందేలను అడ్డుకోవాలని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని తెలిపారు. సంక్రాంతికి పందెం బరులను సిద్ధం చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details