ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HC On Bank Auction: 'ఆస్తుల వేలంలో.. బ్యాంకులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి' - గుంటూరు జిల్లా లేటెస్ట్ న్యూస్

HC On Bank Auction: ఆస్తుల వేలం వ్యవహారంలో బ్యాంకులు నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించి చట్ట నిబంధనలను పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. బ్యాంక్‌ నిర్వహించిన స్థిరాస్తి వేలంలో విజేతగా నిలిచిన ఓ వ్యక్తి మొత్తం సొమ్ము జమ చేయలేదనే కారణంతో.. అడ్వాన్సుగా చెల్లించిన సొమ్మును బ్యాంక్‌ స్వాధీనం చేయడాన్ని తప్పుపట్టింది. వివరాల్లోకి వెళ్తే..

HC On Bank Auction
ఏపీ హైకోర్ట్

By

Published : Jun 27, 2023, 10:32 AM IST

ఆస్తుల వేలం వ్యవహారంలో కెనరా బ్యాంక్​పై హైకోర్టు

HC On Bank Auction: ఆస్తుల వేలం వ్యవహారంలో.. బ్యాంకులు నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. బ్యాంకులు 'ప్రాపర్టీ డీలర్ల' మాదిరిగా కాకుండా చట్టనిబంధనల మేరకు వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఓ తీర్పులో పేర్కొందని గుర్తుచేసింది. బ్యాంక్‌ నిర్వహించిన స్థిరాస్తి వేలంలో విజేతగా నిలిచిన వ్యక్తి మొత్తం సొమ్ము జమ చేయలేదనే కారణంతో అడ్వాన్సుగా చెల్లించిన సొమ్మును బ్యాంక్‌ స్వాధీనం చేయడాన్ని తప్పుపట్టింది.

బ్యాంకు నుంచి రుణం తీసుకొని చెల్లించడంలో విఫలమైనందుకు పెరుమాళ్లు ఆగ్రో ఇండస్ట్రీకి చెందిన గుంటురులోని 302 చదరపు గజాల స్థలాన్ని వేలం వేసేందుకు కెనరా బ్యాంక్‌ 2019లో నిర్ణయించింది. సయ్యద్‌ హిదయతుల్లా బిడ్‌లో పాల్గొని విజేతగా నిలిచారు. నిబంధనల మేరకు 25శాతం సొమ్ముఅడ్వాన్స్‌గా చెల్లించారు. అనారోగ్యం కారణంగా మిగిలిన డబ్బును చెల్లించలేకపోయారు. గడువు పొడిగించాలని కోరగా బ్యాంక్‌ అధికారులు సమ్మతించారు. మొత్తం సొమ్ము చెల్లించేందుకు సమయం మిగిలి ఉండగానే.. రుణం తీసుకున్న వారితో బ్యాంక్‌ అధికారులు చర్చించి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ ద్వారా అప్పు రాబట్టుకున్నారు. దీనిపై హిదయతుల్లా 2019లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బ్యాంక్‌ అధికారులు హద్దుమీరి వ్యవహరించారని ఘాటుగా వ్యాఖ్యానించింది. గడువు ముగియకుండా అడ్వాన్స్‌ సొమ్మును సర్దుబాటు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.

ALSO READ: 'కౌంటర్ దాఖలు వేయకుండా.. కోర్టుతో దాగుడుమూతలు ఆడుతున్నారా?'

దీంతోపాటు ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సొమ్ము జమ చేసేందుకు 2019 అక్టోబర్‌ 25వరకు బ్యాంక్‌ అధికారులు సమయం పొడిగించారని గుర్తుచేసింది. పిటిషనర్‌ అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.22.50లక్షలను బ్యాంక్‌ అధికారులు.. 2019 సెప్టెంబర్‌ 09నే సర్దుబాటు చేసుకున్నారని తెలిపింది. ఆ విధంగా సర్దుబాటు చేసుకోవడం చట్ట నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. పిటిషనర్‌ చెల్లించిన సొమ్ము విషయంలో బ్యాంక్‌ అధికారులు.. హద్దుమీరి వ్యవహరించారని తప్పుపట్టింది. జాతీయ బ్యాంక్‌గా వారి చర్యలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉండాలని హితవుపలికింది.

ALSO READ:HC On Trees Cutting: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్లు కొట్టివేతపై హైకోర్టు ఆగ్రహం..

నిర్ధిష్ట సమయం దాటాకా వేలం విజేత సొమ్ము చెల్లించడంలో విఫలమైనప్పుడు మాత్రమే అడ్వాన్స్‌గా చెల్లించిన సొమ్ము విషయంలో జోక్యం చేసుకునే అధికారం బ్యాంక్‌కు ఉంటుందని తెలిపింది. ఆ గడువు ముగియకుండా అడ్వాన్స్‌ సొమ్మును సర్దుబాటు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఆ స్థలంపై రుణం తీసుకున్న వ్యక్తి రెండుసార్లు లాభపడ్డారని, పిటిషనర్‌ అంతిమంగా శిక్షకు గురయ్యారని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ చెల్లించిన మొత్తం రూ.37.50లక్షలు వెనక్కి పొందేందుకు అర్హుడని స్పష్టంచేసింది. అంతేకాక వేలం ప్రతిపాదిత ఆస్తి పూర్తి వివరాలను కొనుగోలుదారులకు తెలిసేలా చూడాల్సిన బాధ్యత బ్యాంక్‌ అధికారులపై ఉందని పేర్కొంది. ఈ క్రమంలో పిటిషనర్‌ చెల్లించిన 37 లక్షల 50వేలను వెనక్కి ఇవ్వాలని బ్యాంకు అధికారులను ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details