Bail To TDP Leaders : పల్నాడు జిల్లా మాచర్లలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న టీడీపీ వర్గీయులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 16న జరిగిన ఘర్షణల్లో వైసీపీ నేత చల్లా మోహన్‌పై హత్యాయత్నం చేశారని.. మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి సహా 34మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరో 10మందిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు వారికి రిమాండ్ విధించింది. వారు ప్రస్తుతం గురజాల జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
మాచర్ల కేసు.. టీడీపీ వర్గీయులకు ముందస్తు బెయిల్ - హైకోర్టు వార్తలు
Bail Sanctioned to TDP Leaders : మాచర్లలో ఇటీవల జరిగిన పెను విధ్వంసంలో కొందరు టీడీపీ నేతలు హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్నారు. అయితే వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ.. నేరుగా దాడిలో పాల్గొన్నవారికి మాత్రం బెయిల్ మాంజూరు చేయలేదు.
హైకోర్టు టీడీపీ
టీడీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచి.. 23మందికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మోహన్‌పై నేరుగా దాడి చేసిన కళ్లం రమణారెడ్డికి మాత్రం కోర్టు బెయిల్ మాంజూరు చేయలేదు. మరోవైపు రిమాండ్‌లో ఉన్న 10మంది బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇవీ చదవండి: