గుంటూరు జిల్లా తెనాలి కొత్తపేట ఎస్‌బీఐలో ఫీల్డ్ ఆఫీసర్ పేరుతో రూ.లక్ష మోసం చేశాడో వ్యక్తి. తన సోదరుడికి డబ్బు పంపేందుకు బ్యాంకుకు నీలా అనిత అనే మహిళ వెళ్లింది. కాగా ఖాతాలో రూ.లక్ష ఒకేసారి వేయడం సాధ్యపడదని బ్యాంకు సిబ్బంది చెప్పారు.
ఎస్‌బీఐలో ఫీల్డ్ ఆఫీసర్ పేరుతో రూ.లక్ష కాజేశాడు
ఎస్‌బీఐలో ఫీల్డ్ ఆఫీసర్ పేరుతో ఓ మహిళ నుంచి రూ.లక్ష కాజేశాడో వ్యక్తి. ఈ సంఘటన తెనాలిలో జరిగింది.
ఫీల్డ్ ఆఫీసర్‌గా పరిచేయం చేసుకున్న ఓ వ్యక్తి డబ్బును జమ చేస్తానని ఆమెతో చెప్పాడు. డబ్బు తీసుకున్నాక జమ చేసినట్లు నకలీ ఓచర్లు అనితకు ఇచ్చాడు. అయితే అకౌంట్ లోకి డబ్బు రాలేదని సోదరుడు చెప్పడంతో బ్యాంకును అనిత ఆశ్రయించారు. అకౌంట్ లో డబ్బుపడలేదని తెలియడంతో బ్యాంకు అధికారుల సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Cheating: వాహనాలు అద్దెకు పెట్టుకుంటామని నమ్మించాడు.. రూ.2.5 కోట్లతో ఉడాయించాడు!