ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధానిని మార్చే దమ్ము మీకుందా?'

ముఖ్యమంత్రి జగన్ రాజధాని భూములపై మంత్రులతో సబ్​కమిటీ వేయటం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.

జీవీ ఆంజనేయులు

By

Published : Sep 15, 2019, 7:43 PM IST

వైకాపా 100 రోజుల పాలనలో అరాచకం, కక్ష్య సాధింపు చర్యలు

రాజధాని భూములు అన్యాక్రాంతం చేశారని వస్తున్న ఆరోపణలపై తెదేపా నేత, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు స్పందించారు. సొంత డబ్బులతో రాజధానిలో భూములు కొనుగోలు చేస్తే తప్పేంటిని ప్రశించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధాని ప్రాంతంలో రైతులు అందరూ నష్టపోయారని ఆరోపించారు. 'రాజధానిని మార్చే దమ్ము మీకు ఉందా' అని ధ్వజమెత్తారు. దొనకొండకు రాజధాని మారిస్తే ఉద్యోగులు అక్కడకు వచ్చే పరిస్థితి లేదన్నారు. వరదలు వస్తే రాజధాని మునిగిపోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా 100 రోజుల పాలన అంతా అరాచకం, కక్ష సాధింపు చర్యలే తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాజధాని భూముల పై మంత్రులతో సబ్ కమిటీ వేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details