తెదేపా హయంలో అర్బన్ హౌసింగ్‌కు కట్టుబడి 90 శాతం పూర్తి చేశామని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. వైకాపా పాలనలో ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తే.. అదే ఇసుకను వైకాపా రూ.3500 నుంచి రూ.4500 వరకు ధరలు పెట్టి అమ్ముతుందన్నారు. ఫోన్ కొట్టు లిక్కర్ హోమ్ డెలివరీ పట్టు అన్నట్లుగా ప్రజల సొమ్ము నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకి రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల కోసమే తెదేపా పోరాడుతుంది: జీవీ ఆంజనేయులు - వైసీపీపై జీవీ ఆంజనేయులు కామెంట్స్
గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు వైకాపా పాలనపై విమర్శలు చేశారు. పేద ప్రజలకు ఇళ్లు ఇప్పించేందుకు.. తమ పార్టీ పోరాడుతుందన్నారు.
gv anjaneyulu comments on jagan