గురు పౌర్ణమికి దేవాలయాలు ముస్తాబు - temples
రేపు గురుపౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు వేడుకలకు సిద్దమవుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు.
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయిబాబా మందిరంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో గత 20 ఏళ్లుగా షిరిడి సాయి మందిర్‌లో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం గురుపౌర్ణమి వేడుకలకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజామున నుంచే సాయిబాబాకు సామూహిక పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం జరగనుంది. వెయ్యి మంది భక్తులతో సామూహిక శ్రీ లలితా సహస్ర నామ కోటిపారాయణం, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, 10 వేల మందికి అన్నదానం చేయనున్నారు.