గజవాహనంపై క్షీర భావనారాయణుడు - బాపట్ల
గుంటూరు జిల్లా బాపట్ల శ్రీ మత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత క్షీర భావనారాయణ స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనంపై స్వామిని అలంకరించారు.
బాపట్లలో భావనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు
గుంటూరు జిల్లా బాపట్ల శ్రీ మత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత క్షీర భావనారాయణ స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనంపై స్వామిని అలంకరించారు. గదాధరుడైన విష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని తిరు వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. అనంతరం పట్టణంలోని పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.