పోలీస్ స్టేషన్లలో భూ తగాదాలు సంబంధించిన కేసులను పరిష్కరించవద్దని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా వట్టి చేరుకూరు పోలీస్ స్టేషన్‌ని సందర్శించి... రికార్డ్లను తనిఖీ చేశారు. నేరస్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించి... బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్లో సివిల్ కేసులు నిర్వహించరాదు: ఎస్పీ అమ్మిరెడ్డి - గుంటూరు జిల్లా వార్తలు
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల ఫ్రెండ్లి పోలీసింగ్ అమలు చేయడంతో పాటు... స్పందనకు వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సిబ్బందిని ఆదేశించారు.
సిబ్బందితో ఎస్పీ అమ్మిరెడ్డి
పోలీస్ స్టేషన్‌కి వచ్చిన బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. కరోనా పట్ల అప్రమత్తతతో మెలగాలన్నారు. పేకాట, కోడి పందాలు అసాంఘిక కార్యకలపాలు నిర్వహించే వారి పట్ల కఠినంగా వ్యవరించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇవీ చదవండి:కరోనా పేరుతో మోసం.. ముగ్గురు అరెస్టు