ప్రభుత్వ నిర్ణయాలు పూర్తిగా తెలియక పోవడంతో పసిపిల్లలు, మహిళలు, వృద్ధులతో ప్రయాణాలు మార్గ మధ్యలో ఆగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక సతమవుతున్నారు. లారీలు ఇతర రవాణా వాహనాలు నిలిపివేసినప్పటికి కుటుంబాలతో ప్రయాణించే కార్లు, బైక్లు అనుమతించాలని పోలీసులను వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సరిహద్దుల వద్ద జనసాంద్రత తగ్గించి కరోనా నివారణకు కృషి చేయాలని కోరుతున్నారు.
సరిహద్దుల మూసివేతతో ఇబ్బందులు - guntur to telangana boarder closed news
కరోనా ప్రభావంతో ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఇరు ప్రభత్వాలు ప్రకటించాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల గ్రామం సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురుతున్నారు.
సరిహద్దులు బంద్కావటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు