గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన 125 క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిరంగిపురం సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఒక గూడెంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా చౌక బియ్యాన్ని నిల్వ ఉంచారని అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.
Guntur: అక్రమంగా నిల్వఉంచిన 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం - అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యం
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో అక్రమంగా నిల్వఉంచిన 125 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాటికొండ నియోజకవర్గ సివిల్ సప్లై డిప్యూటీ తాశీల్దారు శ్రీనివాసరావు తెలిపారు.
రేషన్ బియ్యం
స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు గూడెం ను సోదా చేసి అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాటికొండ నియోజకవర్గ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి:PDS RICE SEIZED: 172 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత