విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు 15వ వార్డుకు చెందిన స్వర్ణలత(42) మృతి చెందింది. కరోనా పాజిటివ్ నిర్ధరణ కావటంతో రెండు రోజుల క్రితం విజయవాడ రమేష్ హాస్పిటల్లో చేరిన స్వర్ణలత.. స్వర్ణప్యాలెస్ కొవిడ్ సెంటర్లో వైద్యం తీసుకుంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఊపిరాడక మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని మాజీ శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరామర్శించారు.
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో గుంటూరు జిల్లా మహిళ మృతి - swarna pales taja news
విజయవాడ స్వర్ణప్యాలెస్ కొవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన మహిళ మృతి చెందారు. రెండు రోజుల క్రితమే కరోనా పాజిటివ్ రావటంతో స్వర్ణప్యాలెస్ కొవిడ్ కేంద్రంలో చేరినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.
guntur dst women died in Vijayawada swarna pales fire accident