గుంటూరు అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ అధికారిగా పని చేస్తున్న డీఎస్పీ వి.రమేశ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారుతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వాస్తవమే అని తేలిన అనంతరం.. రమేశ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా మెడికొండూరుకు చెందిన ఓ మహిళ... భర్త వేధింపులు, అత్తారింటి చీత్కారాలు భరించలేక మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమెకు పెదాకాకానికి చెందిన వ్యక్తితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. వేరే మహిళతో విహహేతరం సంబంధం పెట్టుకుని బాధితురాలిని భర్త వేధించడం మొదలుపెట్టాడు.
కోరిక తీర్చమన్నాడు.. సస్పెండ్ అయ్యాడు! - pokice
సాయం కోసం వచ్చిన మహిళపై కన్నేశాడు ఆ పోలీసు అధికారి. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కోరిక తీరిస్తేనే సమస్యను పరిష్కరిస్తానని ఆమెతో అన్నాడు. చివరికి సస్పెండ్ అయ్యాడు.
సాయం కోరితే.. కోరిక తీర్చమన్నాడు
ఈ పరిస్థితులతో విసిగిపోయిన ఆమె.. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. మహిళ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమేశ్ కుమార్ న్యాయం చేస్తానంటూ ఆమెను లోబరుచుకునే యత్నం చేశాడు. తరచూ ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. తన కోరిక తీరిస్తే సమస్యను పరిష్కరం చేస్తానని మహిళకు డీఎస్పీ చెప్పారు. ఈ సంబాషణలను బాధితురాలు ఫోన్లో రికార్డ్ చేసింది. వీటిని అర్బన్ ఎస్పీ రామకృష్ణకు అందజేయగా... ఆయన విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని ఆధారాలు ఉన్నందున డీఎస్పీ రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సహంగ్ ఉత్తర్వులు జారీచేశారు.