ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలకు రాకుండా హాజరు.. ఉపాధ్యాయురాలి సస్పెండ్

పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాల్సిన టీచరే నిబంధనలు అతిక్రమించింది. విద్యార్థులు సక్రమంగా బడికి వచ్చేలా చూడాల్సిన ఉపాధ్యాయురాలే.. పాఠశాలకు రాకుండా ఉండేందుకు సాకులు వెతుక్కుంది. పాఠశాలకు రాకుండా ఇంట్లోనే ఉంటూ బయోమెట్రిక్ యంత్రం సాయంతో హాజరు వేసింది. చేసిన పనికి సస్పెండ్ అయి ఇంట్లోనే కూర్చుంది.

By

Published : Dec 10, 2020, 2:26 PM IST

yadlapadu school
యడ్లపాడు పాఠశాల

పాఠశాలకు హాజరు కాకుండా ఇంట్లోనే ఉంటూ బయోమెట్రిక్ యంత్రంతో హాజరు వేస్తున్న ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల( ఓల్డ్ యూపీ)లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పీ. ఉమాదేవి పాఠశాలకు రాకుండా బయెమెట్రిక్ యంత్రంతో హాజరు వేస్తున్నట్లు గుర్తించారు. దీంతో డీఈవో గంగాభవాని ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సదరు ఉపాధ్యాయురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేసే యోచనలో డీఈవో ఉన్నట్లు సమాచారం.

దీనిపై యడ్లపాడు మండల విద్యాశాఖాధికారి డేవిడ్ రత్నంను వివరణ అడగ్గా.. ఆమెను సస్పెండ్ చేసినట్లు ఇంకా అధికారికంగా తనకు ఉత్తర్వుల అందలేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details