గుంటూరులో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి జిల్లాలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 89కి చేరింది. రెండు రోజుల్లోనే 31 కేసులు నమోదయ్యాయి. ఆదివారం సాయంత్రం వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసే సమయానికి ఏడు కేసులే నమోదయ్యాయి. ఆ తర్వాత మరో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యినట్లు గుంటూరు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. వీరిలో ఒకే ఇంట్లో నలుగురు బాధితులు ఉన్నారు. ఈ ఏడు కేసులను వైద్య, ఆరోగ్యశాఖ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. గుంటూరులో ఒకరి మృతితో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఓ వైపు జిల్లా యంత్రాంగం రెడ్ జోన్ల ఏర్పాటు, పూర్తిస్థాయి లాక్ డౌన్ విధింపు వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల తాకిడి పెరుగుతూనే ఉంది. దిల్లీ వెళ్లి వచ్చినవారు, వారిని కలిసిన వారు ఎక్కువమంది వైరస్ బారినపడ్డారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నిన్న గుంటూరులో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించగా... ఇకపై రోజు విడిచి రోజు నిత్యావసరాల అమ్మకాలను చేపట్టాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది.
గ్రామీణంలోనూ కేసులు