ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి - latest news in ap

Group-4 Notification in Telangana : తెలంగాణలో నిరుద్యోగులకు కేసీఆర్​ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. 9,168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Group-4 Notification in Telangana
Group-4 Notification in Telangana

By

Published : Nov 25, 2022, 8:03 PM IST

Group-4 Notification in Telangana : తెలంగాణలో గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. 9,168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉద్యోగ అభ్యర్థులందరికీ మంత్రి హరీశ్​రావు శుభాకాంక్షలు తెలిపారు.

గ్రూప్‌-4 ఉద్యోగాల్లో ప్రధానంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. అత్యధికంగా 6,859 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 2,077 జూనియర్​ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

త్వరలోనే గ్రూప్-2, గ్రూప్​-3 : గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల విడుదలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్దమవుతోంది. కొత్త పోస్టులను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నోటిఫికేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. గ్రూప్-2 లో 663 పోస్టులు, గ్రూప్-3 లో 1373 పోస్టులను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరికొన్ని కేటగిరీ పోస్టులను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమ శాఖల్లో సహాయ అధికారుల పోస్టులకు కూడా గ్రూప్ టూ కిందే నియామకాలు చేపట్టనున్నారు. ప్రభుత్వ విభాగాల్లో సహాయ సెక్షన్ అధికారులు, జువైనల్ సర్వీస్ విభాగంలో ప్రొబేషనరీ అధికారి పోస్టులను కూడా గ్రూప్ టూ కిందే భర్తీ చేయనున్నారు. దీంతో గ్రూప్ టూలో వందకు పైగా పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఈ పోస్టుల ప్రతిపాదనలు, రోస్టర్ వివరాలు కూడా ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్​కు చేరాయి.

కొత్త కేటగిరీలు చేరడంతో గ్రూప్-3 లోనూ పోస్టుల సంఖ్య పెరగనుంది. ఆయా పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలు ఇప్పటికే అందడంతో పాటు పరిశీలన కూడా పూర్తయ్యింది. తాజా ఉత్తర్వులతో సాంకేతికపరమైన అడ్డంకులు కూడా పూర్తయ్యాయి. నోటిఫికేషన్ల జారీకి అవసరమైన కసరత్తును కూడా టీఎస్పీఎస్సీ పూర్తి చేసింది. మొదట గ్రూప్-2, ఆ తర్వాత గ్రూప్-3 నోటిఫికేషన్​ను కొంత విరామంతో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెలతో నోటికేషన్ల ప్రక్రియ పూర్తి కావచ్చని అంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details