గుంటూరు జిల్లా మాచవరం మండలం గోవిందాపురం వద్ద కృష్ణానదిపై అనధికారిక బల్లకట్టు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒక్కో బల్లకట్టు నిర్వహిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ వైపు గోవిందాపురం వద్ద వేలం జరగక బల్లకట్టు ప్రయాణం నిలిచిపోయింది. ఫలితంగా తెలంగాణలోని చింత్రియాల నుంచి వస్తున్న బల్లకట్టు ద్వారా గోవిందాపురం నుంచి వాహనాలు, ప్రయాణికులను అనధికారికంగా చేరవేస్తున్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ నేపథ్యంలో గోవిందాపురం నుంచి బల్లకట్టు నడిపించే అంశంపై అధికారులు తక్షణమే ఓ నిర్ణయానికి రావాలని స్థానికులు కోరుతున్నారు.
'గోవిందాపురం వద్ద కృష్ణానదిపై బల్లకట్టు నడపాలి' - guntur district latest news
గుంటూరు జిల్లాలోని గోవిందాపురం వద్ద కృష్ణానదిపై బల్లకట్టు నడపాలని స్థానికులు కోరుతున్నారు. పొరుగురాష్ట్రమైన తెలంగాణ నుంచి అనధికారింగా బల్లకట్టును నడిపిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
గోవిందాపురం వద్ద కృష్ణానదిపై బల్లకట్టు