Government Employees Participated in Why AP Needs Jagan Campaign :రాజకీయ పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన హద్దులు ప్రభుత్వ అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు చెరిపేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎవరు ఎమనుకున్నా పట్టించుకోకుండా ప్రభుత్వ అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు కలిసిప్రచార కార్యక్రమం (YSRCP Campaign Program) చేపట్టారు. సచివాలయ ఉద్యోగులు బ్యానర్లు కడితే గ్రామ వాలంటీర్లు (Village Volunteers) వైఎస్సార్సీపీ జెండాలు ఎగరేశారు.
YSRCP Campaign Program with Government Employees :రాష్ట్రంలో గురువారం రోజున 'ఏపీకి జగనే ఎందుకు కావాలంటే (Why AP Needs Jagan)' పేరుతో చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వ సిబ్బంది, అధికార పార్టీ శ్రేణులు.. భుజం భుజం కలిపి నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు, పుర, నగరపాలక సంస్థల పరిధిలో కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరాలతో, పూర్తిగా సర్కారు ఖర్చుతో రూపొందించిన డిస్ ప్లే బోర్డుల్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో వైఎస్సార్సీపీ నేతలు ఆవిష్కరించారు. ఎంపీడీఓలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల కమిషనర్లు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా చోట్ల ప్రభుత్వ పథకాల లబ్దిదారుల్ని వాలంటీర్లు బలవంతంగా తీసుకొచ్చారు.
సమస్యలపై ప్రజాప్రతినిధులను ప్రశ్నించిన ప్రజలు : ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, శ్రీకాకుళం, చిత్తూరు, కడప జిల్లాల్లో చాలాచోట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి జై కొడుతూ గ్రామ వాలంటీర్లు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులను సమస్యలపై ప్రజలు ప్రశ్నించిన ఘటనలూ చోటు చేసుకున్నాయి.