గుంటూరు జిల్లాలో నాటుసారాను అరికట్టేందుకు ఎక్సైజ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పండగ సందర్భంగా నాటుసారా తయారుచేసేందుకు కొంతమంది సిద్ధమవుతున్నారన్న సమాచారంతో... దిండి ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పోలీసులకు తయారీదారులు ఎవరు దొరకలేదు. దీంతో తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా తయారుచేస్తే కఠిన చర్యలు తప్పవు - నాటు సారా
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 400 లీటర్లు నాటుసారా తయారీ పదార్థాలను ధ్వంసం చేశారు.
నాటుసారా తయారుచేస్తే కఠిన చర్యలు తప్పవు