గుంటూరులో ముమ్మరంగా వైకాపా ప్రచారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి ముస్తఫాఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. గుంటూరు రాజీవ్ గాంధీ 37 వ డివిజన్ లో ఆయన పర్యటించారు. గడప గడపకు వైఎస్సార్ అంటూ ఎన్నికల ప్రచారం కొనసాగించారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు వివరించారు. గుంటూరులో సమస్యలను గత ప్రభుతం పట్టించుకోలేదని మండిపడ్డారు. నగరంలో ఆరు కమిషనర్లు మారినా అభివృద్ధి శూన్యమన్నారు. ఒక్కసారి జగన్కు అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు.