రైల్వేజోన్ లాభాలన్ని ఒడిశాకు ఇచ్చి... ఖర్చులు మాత్రం మన రాష్ట్రానికి ఇచ్చారని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. ఇది రైల్వేజోన్ కాదన్న గల్లా... మోదీ మాయా జోన్ అని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో జయదేవ్ మాట్లాడారు. వైకాపా ఎంపీలు రాష్ట్ర హక్కుల గురించి పార్లమెంటులో ప్రశ్నించకుండా... రాజీనామాలు చేసి పారిపోయారని విమర్శించారు. మోదీని ఎదురించే ధైర్యం వైకాపాకు లేదన్నారు.
'రైల్వేజోన్ కాదు... మోదీ మాయా జోన్' - మోదీ
విభజన సమయంలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో... విశాఖ రైల్వేజోన్ ప్రకటనలోనూ... అంతే అన్యాయం జరిగిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. వాల్తేర్ డివిజన్ను సగం విజయవాడలో... మిగతా సగం రాయగడ డివిజన్లో కలిపేందుకు కేంద్రం నిర్ణయించి.. రాష్ట్రానికి అన్యాయం చేస్తుందన్నారు.
మాట్లాడుతున్న జయదేవ్
ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా... ఎంపీలు పార్లమెంటుకు రాకుండా... రాజీనామాలు చేసి బాధ్యతలు విస్మరించారని ధ్వజమెత్తారు. ఏదో చేస్తున్నామంటూ... ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కార్పోరేట్ కంపెనీలకు కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న మోదీ... రైతులకు ఎందుకు రుణాలు మాఫీ చేయట్లేదని ప్రశ్నించారు.
ఇది చదవండి...
తెదేపాకు 25 ఎంపీ సీట్లు!