పోలవరం టెండర్ల రద్దుపై లోక్‌సభలో జల్‌శక్తి శాఖ మంత్రి స్పందించారు. పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరమైన విషయమని గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. టెండర్ల రద్దు ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందన్న గజేంద్రసింగ్ షెకావత్... టెండర్ల రద్దుతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, సమయం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తిన అంశానికి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందించారు.
'పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరం' - పోలవరం
పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరమైన విషయమని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో లేవనెత్తిన అంశానికి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానమిచ్చారు.
పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరం