రాష్ట్ర ప్రజలు కోలుకోకుండా చేసిన కేసీఆర్... సహకారం అందిస్తామని చెబితే ఎలా నమ్మాలని ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. కేసీఆర్‌ను నమ్మితే మోదీని నమ్మినట్లేనన్న గల్లా... రాష్ట్రానికి ఏ పరిశ్రమ ఇచ్చినా... తెలంగాణకు ఇవ్వాలని కొర్రీలు పెట్టిన విషయం గుర్తుచేశారు.
'మన కష్టాలకు కేసీఆరే కారణం' - jagan
విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరగడానికి తెలంగాణ సీఎం కేసీఆరే కారణమని... దిల్లీ నేతలతో కుమ్మక్కై హైదరాబాద్‌ను తెలంగాణకు... అప్పులు... ఆంధ్రాకు వచ్చేలా చేశారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో తెదేపా శ్రేణులతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ మట్లాడారు. జగన్... మోదీ... కేసీఆర్ ఒక్కటై... హైదరాబాద్‌లో ఉన్న పార్టీ నాయకులు... బంధువులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ను అడ్డంపెట్టుకొని రాష్ట్రంపై అధికారం చలాయించాలని చూస్తున్నారని విమర్శించారు.
జగన్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనన్న జయదేవ్... 25 మంది ఎంపీలను గెలిపిస్తే దిల్లీలో చక్రం తిప్పగలమని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఈడి నుంచి నోటీసులు పంపించారన్న ఎంపీ... 8 గంటలపాటు తనను విచారరించారని చెప్పారు. తన కుటుంబ సభ్యులపై దాడులకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవ్వరికీ భయపడమని స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని ఉద్ఘాటించారు.