'అంతా మోసమే' - bjp
రైల్వేజోన్ విషయంలో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. 70 శాతం వచ్చే రవాణా ఆదాయం ఒడిశాకు ఇచ్చి... కేవలం 30 శాతం వచ్చే ప్రయాణికుల ఆదాయం మనకు ఇచ్చారన్నారు.
రైల్వేజోన్ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎంపీ గల్లా జయదేవ్ అమరావతిలో అన్నారు. రవాణా ద్వారా వచ్చే ఆదాయం ఒడిశాకు వెళ్తుందని... ఖర్చులు మాత్రమే మనకు మిగులుతాయని తెలిపారు. కేంద్రం ఇచ్చే వాటితో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రధానిని విమర్శించలేదని.. కేవలం రావాల్సిన హక్కుల కోసం డిమాండ్ చేశారని తెలిపారు. గోవా మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారనీ... ఈ ప్రకటనతో కేంద్రం మనల్ని మోసం చేస్తోందో లేక గోవా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు.