పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తోన్న వరద ప్రవాహంతో గుంటూరులోని అమరావతి అమరేశ్వరాలయ ప్రాంగణం జలమయమైంది. అమరావతి ఆలయ పరిసరరాలు, పిండప్రధాన షెడ్లు, ఇటీవల రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన లేజర్ షో పరికరాలు నీటమునిగాయి. ఆలయానికి సమీపంలోని పుష్కర ఘాట్లు, లోతట్టు ప్రాంతాలు, నివాస గృహాలు కూడా నీటిలో మునిగిపోయాయి. వరదలతో పడవలపైనే కృష్ణా జిల్లాలోని చందర్లపాడు, వీరలంక నుంచి అమరావతికి రాకపోకలు సాగిస్తూ, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానిక ప్రజలు.
జలమయమైన అమరావతి అమరేశ్వరాలయం - guntur
పులిచింతల ప్రాజెక్టు వరద ప్రవాహంతో గుంటూరులోని అమరావతి అమరేశ్వరాలయ ప్రాంగణం జలమయమైంది. దేవాలయ ప్రాంత పరిసర ప్రజలందరు పడవలతోనే రాకపోకలు సాగిస్తున్నారు.
జలమయమైన అమరేశ్వరాలయం
TAGGED:
guntur