కొత్త నీరు వచ్చిందంటే చాలు.. చేతినిండా పని, ఆదాయం ఉండే మత్స్యకారులు ఇప్పుడు ఊహించని వరదతో ఉపాధికి దూరమయ్యారు. కృష్ణానదిలో వరద తీవ్రత కారణంగా నాటుపడవలతో వేటకు సాహసించడంలేదు. కృష్ణా జిల్లా ఫెర్రీ నుంచి భారీ మర పడవ నీటి ఉదృతికి కొట్టుకుని ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి దిగువకు వెళ్లిపోవటంతో.. చిన్న చిన్న ఫైబర్ బోట్లతో చేపల వేట సాగించడం ప్రమాదమని మత్స్యకారులు భావిస్తున్నారు. ఐదు రోజుల నుంచి వేట నిలిపివేసి ఒడ్డునే నీటి ప్రవాహం ఎప్పుడు తగ్గుతుందోనని ఎదురుచూస్తున్నారు. ప్రకాశం బ్యారేజీని ఆనుకుని వేట సాగించే మత్స్యకారుల పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ మరిన్ని వివరాలు అందిస్తారు.
ఊహించని వరదతో ఉపాధికి దూరం - guntur
కృష్ణా నదిలో వరద కొనసాగుతుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వేటకు వెళ్తే తప్ప కుటుంబపోషణ జరగని పరిస్థితుల్లో... వరద ఎప్పుడు తగ్గుతుందోనని ఎదురుచూస్తున్నారు.
చేపల వేట