ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపల్లె నియోజకవర్గంలో తొలి కరోనా కేసు నమోదు - రేపల్లె నియోజకవర్గంలో కరోనా కేసు

గుంటూరు జిల్లా రేపల్లె మండలం బేతపూడిలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చిన వ్యక్తి వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించిన నివారణ చర్యలను పటిష్ఠం చేశారు.

firsst corona case in bethapudi repalle constituency in guntur district
బేతపూడిలో కరోనా కేసు

By

Published : Jun 3, 2020, 1:07 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో తొలి కరోనా కేసు నమోదయ్యింది. బేతపూడి గ్రామానికి చెందిన ఒకరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. బాధిత వ్యక్తి ఇటీవల హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చినట్లు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలోకి బయటనుంచి వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

కరోనా కేసు నమోదైన ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. దుకాణాలను మూసివేయించారు. నిత్యావసరాలను ఇళ్లవద్దకే పంపిణీ చేస్తామని తెలిపారు. వీధుల్లో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయించారు.

ఇవీ చదవండి... 'వైకాపా పాలనలో దక్షిణాది బిహార్​లా ఏపీ తయారైంది'

ABOUT THE AUTHOR

...view details