గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంటికి నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ఇంటి సభ్యులు పొలం పనులకు వెళ్లిన వేళ.. ఈ ఘటన జరిగింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి వచ్చి వచ్చి మంటలు ఆర్పివేశారు. ఇంటితో పాటు సామగ్రి, సుమారు రూ.లక్ష నగదు, కొన్ని బంగారు ఆభరణాలు కాలిపోయినట్టు బాధితులు తెలిపారు.