ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధానిపై ప్రభుత్వ తీరు మారే వరకు రైతుల దీక్షలు'

రాష్ట్ర రాజధాని అమరావతిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. 8 నెలలకు చేరిన రాజధాని రైతుల దీక్షలు అమరావతినే రాజధానిగా ప్రకటించే వరకు కొనసాగుతాయన్నారు.

cpi leader nageswara rao
cpi leader nageswara rao

By

Published : Aug 14, 2020, 2:21 PM IST

రాష్ట్రంలో వైకాపాను అడ్డుపెట్టుకొని భాజపా అమరావతి రైతులను మోసం చేసిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. పరిపాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

8 నెలలకు చేరిన రాజధాని రైతుల దీక్షలు... అమరావతినే రాజధానిగా ప్రకటించే వరకు కొనసాగుతాయని నాగేశ్వరరావు అన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రితో చర్చించేందుకు సోము వీర్రాజు ముందుకు రావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details