గుంటూరు జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు తాడేపల్లి మండలంలో వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉండవల్లిలో ఉల్లి, కంద, పసుపు, అరటి, బంతి, లిల్లీ, కొత్తిమీర పంటలు నీటమునిగాయి. పంట పొలాల్లో మోకాల్లోతు నీరు చేరుకుంది. కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీటిని బయటకు పంపాలంటూ రైతులు అధికారులను కోరారు. వారు ఒప్పుకోకపోవడంతో.. కొండవీటి వాగు ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారు. రైతుల ఒత్తిడితో.. ప్రాజెక్టు మోటార్ల ద్వారా పంట పొలాల్లోని నీటిని కృష్ణా నదిలోకి వదిలారు.
భారీ వర్షాలతో వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం
భారీ వర్షాలతో వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. వర్షపు నీటిని బయటకు పంపాలని రైతుల ఆందోళన చేస్తున్నారు. అధికారులు పంట పొలాల్లోని నీటిని కృష్ణా నదిలోకి వదిలారు.
farmers problems