శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తూ... తుళ్లూరులో రైతులు, మహిళలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. గతంలో సీఆర్‌డీఏ బిల్లు రద్దుకు ప్రతిపాదించిన ప్రభుత్వం.. ప్రస్తుతం శాసనమండలి రద్దుపై తీర్మానం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తుళ్లూరులో జై అమరావతి... సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఆకుపచ్చని రైతు పతాకాలు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. తుళ్లూరు, దొండపాడు, అనంతవరం, నెక్కల్లు, నేలపాడు గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు ద్విచక్రవాహన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రాజధానిలో మహిళలు, రైతుల బైక్ ర్యాలీ - ఏపీ రాజధాని అమరావతి వార్తలు
రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మండలిని రద్దు చేస్తూ... వైకాపా ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని అన్నదాతలు తప్పుబట్టారు. మహిళలు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.
రాజధానిలో మహిళలు, రైతులు బైక్ ర్యాలీ