రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ (ఏఈఎస్) జి.నరసింహారావు అన్నారు. రేపల్లె, నగరం పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సూపర్ వైజర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రేపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించారు. తెనాలి డివిజన్ పరిధిలో మొత్తం 96 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 20 దుకాణాలు ప్రారంభించినట్లు... మిగిలిన 76 దుకాణాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోని దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్..గ్రామీణ ప్రాంతాల్లో ఒక సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్ పనిచేస్తారని తెలిపారు. రేపల్లె, నగరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 28 సూపర్ వైజర్ పోస్టులున్నాయన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయన్నారు.
రేపల్లె పరిధిలో మద్యం దుకాణ ఉద్యోగార్థుల ధ్రువపత్రాల పరిశీలన
విడతల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెనాలి ఎక్సైజ్ అధికారి నరసింహారావు తెలిపారు. రేపల్లె, నగరం పరిధిలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు వచ్చిన అభ్యర్థుల దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఎంపిక ప్రక్రియ జిల్లా సంయుక్త కలెక్టర్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.
రేపల్లె పరిధిలో మద్యం దుకాణ ఉద్యోగార్థుల ధ్రువపత్రాల పరిశీలన
Last Updated : Sep 6, 2019, 10:45 AM IST