గుంటూరు జిల్లా దాచేపల్లిలో మద్యం దుకాణాలపై తనిఖీలు నిర్వహించేదుకు వెళ్లిన మహిళా అధికారిణి పాము కాటుకు గురయ్యారు. మధ్యాహ్నం విధులు నిర్వర్తిస్తుండగా.. నర్సాపేట డిపో అసిస్టెంట్ మేనేజర్ మేరీ స్వర్ణలతపై పాము కాటు వేసింది. దీనిని గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన దాచేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నర్సాపేటకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
SNAKE BITE: మద్యం దుకాణంలో తనిఖీలు..అధికారిణికి పాము కాటు - guntur district news
గుంటూరు జిల్లాలో మద్యం దుకాణాల తనిఖీలో ఓ అధికారిణిని పాము కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
SNAKE BITE