తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి బాటలు వేస్తే .... వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకానికి బాటలు వేస్తోందని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన చలో ఆత్మకూరు విజయవంతమైందన్నారు. రాజకీయ పార్టీ తరుఫున దేశంలో మొట్టమొదటిసారిగా బాధితుల శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించటం సంతోషకరమన్నారు. తాము ఇచ్చిన 16 డిమాండ్లు నెరవేర్చాలని... బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని దాడులు నివారించి.... అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హితువు పలికారు. తెలుగుదేశం చేసిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమని తెలిపారు.
తెదేపా హయంలో ప్రగతిపథం...వైకాపా చేస్తోంది అరాచకం - ycp
వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకానికి బాటలు వేస్తోందని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు విమర్శించారు.
జీవీ ఆంజనేయులు