కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం: తెదేపా నేతలు - గుంటూరు
అధికారం రావటం.. పోవటం జరుగుతూ ఉంటాయి. కానీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేదిలేదని తెదేపా నేతలు హెచ్చరించారు.
ex_minister_nakka_about_ycp
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో వైకాపా శ్రేణుల దాడిలో గాయపడి ప్రభుత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా కార్యకర్తలను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయలు, ఎమ్మెల్యే గిరిధర్ పరామర్శించారు. రాష్ట్రంలో వరుసగా దాడులు జరుగుతున్నాయని.. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై, ప్రభుత్యంపై ఉందని గుర్తుచేశారు. తెదేపా అధికారంలో ఉండగా ఎన్నడూ దాడులు జరగలేదని పేర్కొన్నారు.