గుంటూరు నగరంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.... అధికారులు మైక్రో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కేసులు నమోదైన 20మీటర్ల వరకూ ప్రాంతాన్ని మైక్రో కంటైన్మెంట్లుగా వ్యవహరిస్తారు. మైక్రో కంటైన్మంట్ జోన్లలో ప్రజలు ఎక్కువగా తిరగవద్దని హెచ్చరించే ఉద్దేశంతోనే ఈ బోర్డులు ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.
గుంటూరులో మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో...అధికారులు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. గుంటూరులో కొవిడ్ కేసులు అధికమౌతున్న కారణంగా... మైక్రో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు.
గుంటూరులో మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు