ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్లో విద్యుదాఘాతం ఘటనపై విచారణ - electric shock

గుంటూరు నుంచి ఒంగోలుకు వెళ్తున్న లోకల్​ రైలు వేజెండ్ల స్టేషన్ వద్ద రైలు బోగీలకు విద్యుత్​ ప్రసారం కావడంతో రైలును నిలిపివేశారు. బోగీల్లోని కొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీనిపై పరిశీలించేందుకు ఆరుగురు అధికారుల బృందం వచ్చారు.

రైలు ప్రయాణికులకు విద్యుదాఘాతం

By

Published : May 7, 2019, 3:55 PM IST

రైలు ప్రయాణికులకు విద్యుదాఘాతం

గుంటూరు-ఒంగోలు లోకల్​ రైలు బోగీలకు విద్యుత్​ ప్రసారం కావడం..పలువురు ప్రయాణికులకు గాయాలైన ఘటనపై ఆరుగురు అధికారుల బృందం విచారణ జరుపుతోంది. సోమవారం రైలును పరిశీలించిన బృందానికి ఎలాంటి లోపాలు కనిపించకపోవడంతో.. మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వైర్లకు ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా... లేక మరి ఇంకేమైనా సమస్యలు తలెత్తాయా అనేది పూర్తి స్థాయిలో పరిశీలించాక ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఏ రైలు బోగీలకు విద్యుత్​ ప్రసారం కాలేదని.. మొదటిసారి ఇలా జరిగిందని సౌత్​ డివిజన్​ భద్రతా ముఖ్య అధికారి ఇఎంజి శేఖరం అన్నారు.

ABOUT THE AUTHOR

...view details